ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి కోపం చాలా ఎక్కువ. అతడు ఉన్నదానికీ లేని దానికీ కోపం తెచ్చుకుని అందరినీ కోప్పడుతూ ఉండేవాడు.అతని తండ్రి కోపం తగ్గించుకోవడానికి ఒక సలహా ఇస్తాడు. అతనికి ఒక సంచి నిండా పొడుగాటి సీలలు(nails) ఇచ్చి ఇకనుంచీ నువ్వు ఎవరిపైనైనా కోప్పడినప్పుడల్లా ఒక సీలని ఈ గోడ లోకి కొట్టమని చెప్తాడు. మొదటిరోజు ఆ అబ్బాయి పదిహేను సీలలు గోడలోకి కొడతాడు. రోజులు గడిచే కొద్దీ అతను కొట్టే సీలలు తగ్గుతూ వస్తాయి. అతను ఈ సీలలు గోడలోకి కొట్టడం కన్నా తన కోపాన్ని అదుపులో ఉంచడమే సులభంగా ఉందని అనుకుంటూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత అతను ఒక రోజు అసలు ఎవ్వరి మీద కోప్పడడు. అతను ఎంతో ఆనందం తో తన తండ్రి దగ్గరకి వెళ్లి నాన్నా ఈ రోజు నేను ఎవ్వరి మీద కొప్పడలేదు అని చెప్తాడు. అప్పుడు తండ్రి చాలా మంచిది నాయనా, ఇక నుండీ నువ్వు ఎవ్వరి మీద కోప్పడని రోజున రోజుకొక్కటి చొప్పున ఆ గోడలో కొట్టిన సీలలు తీసివెయ్యమని చెప్తాడు.
కొన్ని రోజుల తర్వాత అతను అన్ని సీలల్నీ తీసివేయగలుగుతాడు. అప్పుడు అతను తన తండ్రితో తను అన్ని సీలలనీ తీసివేయగలిగానని చెప్తాడు. అప్పుడు ఆ తండ్రి, నువ్వు చాలా మంచి పని చేసావు నాయనా..కానీ నువ్వు గోడకి కొట్టిన సీలల్నైతే తీసి వేయగాలిగావు కానీ ఆ సీలలు గోడకు చేసిన గాయాన్ని మాన్చలేవు. ఆ గోడకున్న రంధ్రాలను చూసావా, ఆ గోడ తిరిగి మామూలుగా ఎప్పటికీ అవదు. అలాగే నువ్వు ఎవరినైనా కోపంలో ఎన్నో మాటలని అని వారి మనసును గాయపరిచిన తర్వాత నువ్వు వాళ్ళకి ఎన్ని క్షమాపణలు చెప్పినా సరే నువ్వు చేసిన ఆ గాయమనేది మానదు అని చెప్తాడు. ఆ తరువాత ఆ అబ్బాయి తన తండ్రి నేర్పిన ఈ పాఠాన్ని ఎప్పుడూ మరిచిపోలేదు.
bagumdi
ReplyDeleteచాలా బాగుంది.
ReplyDeleteword verification తీసివేయగలరు.ఒకవేళ ఎలా తీసివేయలో మీకు తెలియక పోతే ఈ క్రింది టపా చూడండి.
http://tolichiniku.blogspot.com/2008/09/word-verification.html
ఇంతకు ముందు విన్నదే, కానీ, ఎన్ని సార్లు వింటే, కోపమొచ్చినప్పుడు సమయానికి గుర్తుంటుంది?
ReplyDeleteకామెంట్ చేసిన శ్రీకాంత్ వాడరేవు గారికీ, చిలమకూరు విజయమోహన్ గారికీ, చిన్నమయ్య గారికీ నా ధన్యవాదాలు.
ReplyDeleteword verification తీసివేయబడినది. గుర్తించి చెప్పినందుకు విజయమోహన్ గారికి ధన్యవాదాలు.
awesome...!
ReplyDeletebagundi kani vinadanike.....acharana kashtame sumaaaa
ReplyDelete