Monday, December 12, 2011

విలువకు కొలమానం.

విలువకు కొలమానం.
రచయత పెన్మెత్స శ్రీకాంత రాజు.
నేను ఈ మధ్య చదివిన కధలలో నాకు నచ్చిన కధ.
కేవలం చదువు మాత్రమే ముఖ్యం కాదు. విలువలు అంతకంటే ముఖ్యం అని చెప్పే కధ. అందుకే నాకు బాగా నచ్చింది.

మీరు కుడా తప్పకుండ చదవండి. లాస్ట్ ఆదివారం ఈనాడు లో వచ్చింది ఈ కధ.  లింక్ http://eenadu.net/Magzines/Sundayspecialinner.aspx?qry=katha



Wednesday, April 13, 2011

చాలా విషయాలు అంత ముఖ్యం కాదు.

చాలా విషయాలు అంత ముఖ్యం కాదు.

ఎన్నో విషయాల గురించి నేను ఆత్రుత చెందాను. నా సమయాన్నీ శక్తి నీ ఎన్నో విషయాల మీద వెచ్చించాను. కానే అవన్నీ అంత ముఖ్యం కాదు అని తరువాత తెలిసింది. జీవితం లో నిజం గా ఆనందం గా ఉండటానికి అతి కొద్ది విషయాలు సరిపోతాయి అని చివరకి తెలుసుకోగలిగాను. మిగతా విషయాలను వదిలేసి ఆ ముఖ్యమైన వాటి మీద మాత్రమే దృష్టి పెడితే బాగుండేది అని ఇప్పటికీ అర్ధమైంది.

So much of what I got excited about, anxious about, or wasted my time and energy on, turned out not to matter. There are only a few things that truly count for a happy life. I wish I had known to concentrate on those and ignore the rest.


Things I wish I’d known when I was younger అనే ఆర్టికల్ లో వెల్లడించిన ఈ భావాలు మనసుని కదిలిస్తాయి.
చూడండి.



నీకు తెలియక పోయి.......


"Its not what you dont know and dont apply but its what you know but dont apply is dangerous"

నీకు తెలియక పోయి నువు అప్లై చెయ్యక పోయే వాటికన్నా నీకు తెలిసీ అప్లై చెయ్యకపోయే వాటి వలన వొచ్చే నష్టమే ఎక్కువ.

ఇది నా అనుభవం.

కొన్ని కొటేషన్ లు అనుభవాలనుంచే పుడతాయేమో. కొన్నేమిటి ఆ మాటకొస్తే అన్ని కొటేషన్ లూ అంటే కదా.
 
ఒక నష్టం జరిగిన తరువాత వెనక్కి తిరిగి ఎందుకిలా జరిగింది అని చూస్తే మనం చేసిన తప్పు ప్రాధమికాల ( basics) కి సంబంధించింది అని అర్ధమవుతుంది. 

ఎప్పుడైతే ఆ Basics ని క్లియర్ గా అనుకోని, రాసిపెట్టుకుని ఆ తరువాత పని చేసేటపుడు  మనకి డౌట్ వచ్చినపుడల్లా వాటిని చూస్తే ఎలా ముందుకు వెళ్ళాలో, ఏం చెయ్యాలో  తెలిసిపోతుంది.
ఆ Basics లో తప్పు చేయకుండా ముందుకు వెళ్ళగలిగితే చాలు. దేన్నైనా సరే చాలా బాగా చేయవచ్చు.

ఈ ప్రాధమిక విషయాలు(Basics) మనకి ముందే తెలిసి ఉండ వచ్చు. కానీ ఒక పని చేసేటపుడు ముందుకు వెళ్ళే కొద్దీ వచ్చే complications లో పడి తప్పులు చేస్తూ ఉంటాం. జాగ్రతగా గమనిస్తే ఆ తప్పులు Basics కి సంబంధించినవే అయ్యుంటాయి. 
అంటే మనకి కొత్తది తెలియక పోవడం వలన కాదు మనకి తెలిసింది కరెక్ట్ గా చెయ్యకపోవడం వలనే అలా జరిగింది అన్న మాట. నేను ఈ టపా మొదటి వాక్యం లో రాసిన కొటేషన్ అదే.
ఇదంతా చదివి, అర్ధమయిన తరువాత కూడా ఇదిరవకు లాగానే ఉండొచ్చు. మన ప్రవర్తన లో ఎటువంటి మార్పులు రాకపోవచ్చు.
మళ్ళీ అదే కొటేషన్.

"Its not what you dont know and dont apply but its what you know but dont apply is dangerous"

అంతే కదా??

Wednesday, November 10, 2010

ఆన్ లైన్ లో తెలుగు రేడియో

తెలుగు లో ఆన్ లైన్ లో రేడియో విందాం అనుకునే వాళ్ళకు అద్భుతమైన సైట్ టోరీ. ఇది పూర్తిగా ఉచితం. అంతే కాదు దీనిలో వాణిజ్య ప్రకటనలు కూడా చాలా తక్కువ. మనకి ఓపిక ఉండాలే గానీ ఇరవై నాలుగు గంటలపాటూ పాటలు వినవచ్చు.
దీనిలో పది తెలుగు చానల్స్ ఉన్నాయి.
ఘంటసాల పాటలు, రహమాన్ పాటలు, సరికొత్త పాటలు, అల్ టైం హిట్స్, తొరి లైవ్ అనే అయిదు వైవిధ్యమన చానెల్స్ తో పాటు US Pacific, US Eastern, UK, IST, Australia అనే మరో అయిదు చానెల్స్ కూడా ఉన్నాయి. ఈ చివరి చానెల్స్ లో ఆయా దేశాల సమయాలని అనుసరించి పాటలు, కార్యక్రమాలు వస్తాయి.
నాకెంతో నచ్చే ఆన్ లైన్ తెలుగు రేడియో Tori.
దీనిని మొబైల్ లో కూడా వినవచ్చు అయితే బ్లాక్బెర్రీ లేదా iphone లేదా నోకియా E series ఫోన్ ఉండి ఉండాలి
అల్ టైం హిట్స్ లో ఎన్నో మంచి మంచి పాటలు వినచ్చు. ఒక వేళ మనకు ఆ వచ్చే పాట నచ్చకపోతే ఎటు తిరిగీ వేరే చానల్స్ సిద్ధం గా నే ఉన్నాయి. నాకైతే ఎప్పుడు టోరీ ని విన్నా ఏదో ఒక ఛానల్ లో నాకు నచ్చే పాట వస్తుంది.(ఇప్పుడు చినుకు లా రాలి నదులుగా సాగి పాట వస్తోంది సినిమా: నాలుగు స్తంబాలాట) నేను ఎన్నో మంచి పాటలను గుర్తుచేసుకుని మళ్ళీ వినగలిగాను.
మీరు కూడా మీకు నచ్చే మంచి మంచి పాటలు వినాలనుకుంటే ........
ఆలస్యం లేకుండా టోరి కి ట్యూన్ అయిపోండి మరి.

Friday, August 14, 2009

మీరు బ్లాగు పోస్టులు ఎలా రాస్తారు?

చాలా మంది చెప్పే మాట లేఖిని వాడతాము అని.
ఏమో నాకు ఆది అంత కన్వీనియెంట్ గా అనిపించ లేదు. మరి ఏం చేశాను? మొదట్లో గూగుల్ వాడి ఇండిక్ translation వాడాను. కానీ దాన్లో ఓ చిక్కుంది. అదేంటో తర్వాత చెప్తా. అందుకని నేను మరో మార్గం కనిపెట్టాను. ముందుగా ఎమెస్ వర్డ్ లొనో లేకపోతే నోట్ పాడ్ లొనో చక్కగా తెలుగు ని ఇంగ్లీష్ లో అంటే ఇలా english ni telugu lo అన్నమాట టైప్ చేసుకుంటూ వెళ్ళి పోతాను. తర్వాత క్విల్ పాడ్ ని ఓపెన్ చేసి ఎడిటర్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడ టైప్ చేసినదంతా ఇక్కడ ఎడిటర్ లో పేస్ట్ చేస్తాను. అప్పుడు ఆది అంతా చక్కగా తెలుగులోకి మారిపోతుంది. అఫ్ కోర్స్ ఒక టెన్ పర్సెంట్ మనం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఈ పద్దతే సులభం గా అనిపించింది. అదే మనం తెలుగు ని ఇంగ్లీష్ లో టైపు చేసిన దానిని గూగుల్ ఇండిక్ translation లో మనం పేస్ట్ చేస్తే అది ఆటోమాటిక్ గా కన్వర్ట్ చేయదు. నేను ఇందాక ఇండిక్ translation లో చిక్కుంది అన్నాను కదా అది ఇదే.

ఐతే మీరు అనొచ్చు క్విల్ పాడ్ లోనే డైరెక్ట్ గా టైప్ చెయ్యొచ్చు కదా అని. అక్కడ సమస్య ఏంటంటే మనం దాన్లో టైప్ చేస్తుంటే వెంటనే ఆది కన్వర్ట్ చేస్తూ పోతుంది. అప్పుడు తప్పులు పడుతూ ఉంటే ఆలోచన సరిగ్గా సాగదు. నాకైతే ఆ తప్పుల్ని సరి చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. మన ఆలోచనలని అంతే వేగం తో అక్షరాలలోకి టైప్ చేసుకుంటూ పోవాలంటే మొదట ఇలా ఇంగ్లీష్ లో టైప్ చేసుకొని తర్వాత కన్వర్ట్ చేయడమే బెటర్ అని నా అభిప్రాయం.

మరో మంచి పద్ధతి ఏమైనా ఉంటే చెప్పండి. తెలుసుకుంటాను.

Wednesday, January 7, 2009

నేనూ విజయవాడ పుస్తకమహోత్సవమూ e-తెలుగు

చివరి సారిగా టపా రాసి రెండు నెలలు పైనే అవుతోంది. మధ్యలో రెండు నెలలుగా ఎక్జామ్స్ తో బాగా బిజీ గా ఉండడం తో రాయడం కుదరలేదు. బ్లాగులు చదివింది కూడా చాల తక్కువే.
ఈ మధ్య జరిగిన సంఘటనలూ విశేషాలూ.
నాలుగో తేదీ విజయవాడ లో జరిగిన పుస్తక మహోత్సవానికి వెళ్ళాను. నాలుగు సంవత్సరాలుగా ఎప్పుడూ మిస్సవలేదు. ఈసారి నాకుందేమో తక్కువ టైం.
సరే ఒక్కొక్కటిగా బుక్ స్టాల్స్ ని చూసుకుంటూ వెళుతున్నాను. అక్కడి ప్రాంగణం లో రెండు సభలు జరుగుతున్నాయి. ఒక దానిపై పట్టాభిరాం గారి సభ జరుగుతోంది. మరొక దానిపై ఏమి జరుగుతోందో చూద్దామని వెళ్ళానా ఇంకేముంది అక్కడ "e-తెలుగు" అనే బానర్ కట్టి ఉంది. చూస్తే ఎవరో లేఖిని గురించీ తెలుగు బ్లాగుల గురించీ ప్రసంగిస్తున్నారు. భలే ఆనందమేసింది. ఆయన పవర్ పాయింట్ ఉపయోగించి చక్కగా వివరిస్తున్నారు. సభ అయిపోయిన తర్వాత ఆయనని కలుసుకొని నన్ను నేను పరిచయం చేసుకున్నాను. అప్పుడు తెలిసింది. ఆయనే కిరణ్ గారని. అదే నేను మొదటి సారి ఇతర బ్లాగర్లను కలుసుకోవడం. నా బ్లాగు పేరడిగారాయన. యువకుడు అని చెప్పాను. అక్కడ ఉన్న అందరు బ్లాగర్లు కలసి ఫోటో తీసుకుంటున్నారు. నన్ను కూడా వచ్చి నిలబడమన్నారు.
ఇదిగో అదే ఈ ఫోటో.


ఆ ఆరెంజ్ కలర్ చెక్స్ షర్టు వేసుకొని ఉన్నది నేనే(కుడి వైపు)

అరుణం బ్లాగు రచైత అరుణ గారూ, జీవితం లో కొత్త కోణం బ్లాగు రచైత శ్రీనివాస్ గారూ పరిచయమయ్యారు. ఇప్పుడే ఫోటో లు చూస్తుటే తెలుసింది చదువరి గారు కూడా అక్కడే ఉన్నారని. ఆయన్ని కలుసుకోలేక పోయినందుకు కొంచెం బాధగా ఉంది.

పుస్తకాల విషయానికొస్తే ఒక పది పుస్తకాలు కొన్నా. నామిని రాసిన మిట్టూరోడి కథలూ, రంగనాయకమ్మ గారి కథల సంపుటి "అమ్మకి ఆదివారం లేదా?" , ఇంకా యండమూరి కొత్త పుస్తకం("వీళ్లనేం చేద్దాం?"), ఏమిటో ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అనుకుంటుంటే ఇక్కడ కూడా ప్రశ్నలే! :) ఇంకా pleasures of లైఫ్ అనే ఇంగ్లీష్ పుస్తకమూ, రిచ్ డాడ్ పూర్ డాడ్ మొదలైనవి కొన్నా. పండక్కి సెలవులు తీసుకొని తరువాత రోజు పొద్దున్నే విజయవాడ నుంచి మా ఊరు వొచ్చాను. అదేనండీ నెల్లూరు జిల్లా కావలి. కొన్న పుస్తకాలన్నే ఈ సెలవుల్లో చదివేయ్యాలి. ఇంకా ఈ సెలవుల్లో కరువుతీరా ఒక నాలుగు టపాలన్నా రాసెయ్యాలి. మా అమ్మ పెట్టే ఫిల్టరు కాఫీ రోజుకి రెండు కప్పులన్నా తాగేయ్యాలి. ఇంకా చాలా పనులున్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఈ టపాని ఇక్కడితో ముగిస్తున్నా. మరిన్ని కబుర్లతో మరో టపా రాస్తా.

శరత్ సోలా.

Monday, October 20, 2008

కొన్ని మంచి డైలాగులు..

నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఒక రైటర్ గా అభిమానిస్తాను. ప్రాస లతో అతను రాసే డైలాగులు నవ్వు తెప్పించక మానవు. అంతే కాదు కొన్ని కొన్ని చోట్ల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వాక్యాలు కూడా మనకి కనపడతాయి. ఆయన రాసిన నాకు నచ్చిన కొన్ని డైలాగులు మీతో పంచుకుందామని ఈ పోస్ట్.
ఆయన నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి, నువ్వే కావాలి, చిరునవ్వుతో, అతడు, నువ్వే నువ్వే, జల్సా లాంటి సినిమా లకు డైలాగులు రాశారు.

మొదటి మూడు సినెమాలైతే ఎన్ని సార్లు చూశానో. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తాయి.

ఆయన రాసిన నాకు నచ్చిన కొన్ని డైలాగులు.

కొన్ని కామెడీ డైలాగులు... కొన్ని డెప్త్ ఉన్న డైలాగులు.....

"మనం గెలిచినప్పుడు భుజం తట్టే వాళ్లు , ఓడినప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు నలుగురు లేనప్పుడు
ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా పెద్ద తేడా ఉండదు"

"అందం అంటే మనం ఇతరులకు నచ్చేలా ఉండడం కాదు. మనకు నచ్చేలా మనం ఉండడం "

"ఒకరికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం మరొకరికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఇంకోళ్ళకి రాముడంటే ఇష్టం
మరి ఇక్కడుండే వాళ్ళందరికీ ఒక్క దేవుడే నచ్చనప్పుడు ఆఫ్ట్రాల్ నేను మనిషిని నేను అందరికీ నచ్చాలని రూలేం లేదు కదా."

'నేను నీకు నచ్చకపోతే ఆది నీ ప్రాబ్లమ్ నాది కాదు."

" దేవుడు చెడ్డవాడు
కళ్ళు ఉన్నాయని ఆనందించేలోపే కన్నీళ్లున్నాయని గుర్తుచేస్తాడు."

ఎవరైనా ఎదిగిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. కానీ నీ కొడుకు ఎదగటానికి పెళ్లి చేసుకుంటున్నాడు. తప్పు.

"నిజం చెప్పక పోవడం ఆబధ్ధం
అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నించడం మోసం"

"గెలిచినప్పుడు ఏ వెధవైనా నవ్వుతాడు.
ఓడిపోయినప్పుడు నవ్వే వాడే హీరొ".

"మనం రిక్షా తొక్కి పైకొచ్చాం కదా అని, మన పిల్లల్ని కూడా రిక్షా తొక్కమనడం... కరెక్ట్ కాదు అంకుల్ "

"మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే , వారి తప్పులను క్షమించ గలగాలి, లేదా ప్రేమించట్లేదని ఒప్పుకోవాలి."


"మీకొక మనిషి తెలుసు, నాకొక పేరు తెలుసు..
వెతుకుదాం..
మీ భయం పోయెదాకా.. నా కోపం తగ్గే దాకా..
వాడు చచ్చే దాకా!!"


ఇప్పుడు కొన్ని కామెడీ వి.

కుర్రాడు చాకు లాగా ఉన్నాడు
"ఇంతకు ముందు కత్తి లాగా ఉండేవాడు .ఈ మధ్య డైటింగ్ చేశాడు"

" నీ తో ఇదేరా ప్రాబ్లమ్. సెంటీమీటర్ చనువిస్తె చాలు కిలోమీటర్ దూసుకెళ్లి పోతావ్."

"బంతీ
ఏం కావాలి సర్?
కొంచెం మనశ్శాంతి"


ఆ అమ్మాయిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు రా
అంత లావా?

"colleges ఎలా ఉన్నారు?
ఒక అమ్మాయి బాగుంది అంకుల్"

ఈ మైక్ made in japan.
ఇండియా లో పనిచేస్తుందా????
జోక్...
మైక్..

"అంజనేయ స్వామి తెలుసా
గుళ్ళో చూడడమేనండీ బయట పెద్ద పరిచయం లేదు."

ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. చదువరులకు నచ్చితే మరిన్ని పోస్ట్ చేస్తా.

ప్రస్తుతానికి ఉంటానేం.