Monday, October 20, 2008

కొన్ని మంచి డైలాగులు..

నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఒక రైటర్ గా అభిమానిస్తాను. ప్రాస లతో అతను రాసే డైలాగులు నవ్వు తెప్పించక మానవు. అంతే కాదు కొన్ని కొన్ని చోట్ల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వాక్యాలు కూడా మనకి కనపడతాయి. ఆయన రాసిన నాకు నచ్చిన కొన్ని డైలాగులు మీతో పంచుకుందామని ఈ పోస్ట్.
ఆయన నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి, నువ్వే కావాలి, చిరునవ్వుతో, అతడు, నువ్వే నువ్వే, జల్సా లాంటి సినిమా లకు డైలాగులు రాశారు.

మొదటి మూడు సినెమాలైతే ఎన్ని సార్లు చూశానో. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తాయి.

ఆయన రాసిన నాకు నచ్చిన కొన్ని డైలాగులు.

కొన్ని కామెడీ డైలాగులు... కొన్ని డెప్త్ ఉన్న డైలాగులు.....

"మనం గెలిచినప్పుడు భుజం తట్టే వాళ్లు , ఓడినప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు నలుగురు లేనప్పుడు
ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా పెద్ద తేడా ఉండదు"

"అందం అంటే మనం ఇతరులకు నచ్చేలా ఉండడం కాదు. మనకు నచ్చేలా మనం ఉండడం "

"ఒకరికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం మరొకరికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఇంకోళ్ళకి రాముడంటే ఇష్టం
మరి ఇక్కడుండే వాళ్ళందరికీ ఒక్క దేవుడే నచ్చనప్పుడు ఆఫ్ట్రాల్ నేను మనిషిని నేను అందరికీ నచ్చాలని రూలేం లేదు కదా."

'నేను నీకు నచ్చకపోతే ఆది నీ ప్రాబ్లమ్ నాది కాదు."

" దేవుడు చెడ్డవాడు
కళ్ళు ఉన్నాయని ఆనందించేలోపే కన్నీళ్లున్నాయని గుర్తుచేస్తాడు."

ఎవరైనా ఎదిగిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. కానీ నీ కొడుకు ఎదగటానికి పెళ్లి చేసుకుంటున్నాడు. తప్పు.

"నిజం చెప్పక పోవడం ఆబధ్ధం
అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నించడం మోసం"

"గెలిచినప్పుడు ఏ వెధవైనా నవ్వుతాడు.
ఓడిపోయినప్పుడు నవ్వే వాడే హీరొ".

"మనం రిక్షా తొక్కి పైకొచ్చాం కదా అని, మన పిల్లల్ని కూడా రిక్షా తొక్కమనడం... కరెక్ట్ కాదు అంకుల్ "

"మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే , వారి తప్పులను క్షమించ గలగాలి, లేదా ప్రేమించట్లేదని ఒప్పుకోవాలి."


"మీకొక మనిషి తెలుసు, నాకొక పేరు తెలుసు..
వెతుకుదాం..
మీ భయం పోయెదాకా.. నా కోపం తగ్గే దాకా..
వాడు చచ్చే దాకా!!"


ఇప్పుడు కొన్ని కామెడీ వి.

కుర్రాడు చాకు లాగా ఉన్నాడు
"ఇంతకు ముందు కత్తి లాగా ఉండేవాడు .ఈ మధ్య డైటింగ్ చేశాడు"

" నీ తో ఇదేరా ప్రాబ్లమ్. సెంటీమీటర్ చనువిస్తె చాలు కిలోమీటర్ దూసుకెళ్లి పోతావ్."

"బంతీ
ఏం కావాలి సర్?
కొంచెం మనశ్శాంతి"


ఆ అమ్మాయిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు రా
అంత లావా?

"colleges ఎలా ఉన్నారు?
ఒక అమ్మాయి బాగుంది అంకుల్"

ఈ మైక్ made in japan.
ఇండియా లో పనిచేస్తుందా????
జోక్...
మైక్..

"అంజనేయ స్వామి తెలుసా
గుళ్ళో చూడడమేనండీ బయట పెద్ద పరిచయం లేదు."

ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. చదువరులకు నచ్చితే మరిన్ని పోస్ట్ చేస్తా.

ప్రస్తుతానికి ఉంటానేం.

Friday, October 10, 2008

మీకోసం ఓ జోక్

ఒకసారి ఒక పిల్లి, ఒక గున్న ఏనుగు మాట్లాడుకుంటున్నాయి

పిల్లి ఏనుగుని నీ వయస్సెంతా అని అడిగింది
అప్పుడు ఏనుగు నా వయస్సు ఐదు సంవత్సరాలు అని అంది.

అవునా..! మరి నువ్వు అంత పెద్దగా ఉన్నావేం అని పిల్లి తెగ ఆశ్చర్యపోతూ అడిగింది.

నేను కాంప్లాన్ బాయ్ ని మరి అంది ఏనుగు.

మరి నీ వయస్సెంత అని అడిగింది ఏనుగు

నా వయసా..! ముప్పై సంవత్సరాలు అని అంది పిల్లి.

అరె నిజంగానా నువ్వు మరి చాలా చిన్నదానిలా ఉన్నావేం అని అడిగింది ఏనుగు

నేను సంతూర్ గాళ్ ని మరి అని సిగ్గుపడుతూ అంది పిల్లి.