Monday, October 20, 2008

కొన్ని మంచి డైలాగులు..

నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఒక రైటర్ గా అభిమానిస్తాను. ప్రాస లతో అతను రాసే డైలాగులు నవ్వు తెప్పించక మానవు. అంతే కాదు కొన్ని కొన్ని చోట్ల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వాక్యాలు కూడా మనకి కనపడతాయి. ఆయన రాసిన నాకు నచ్చిన కొన్ని డైలాగులు మీతో పంచుకుందామని ఈ పోస్ట్.
ఆయన నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి, నువ్వే కావాలి, చిరునవ్వుతో, అతడు, నువ్వే నువ్వే, జల్సా లాంటి సినిమా లకు డైలాగులు రాశారు.

మొదటి మూడు సినెమాలైతే ఎన్ని సార్లు చూశానో. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తాయి.

ఆయన రాసిన నాకు నచ్చిన కొన్ని డైలాగులు.

కొన్ని కామెడీ డైలాగులు... కొన్ని డెప్త్ ఉన్న డైలాగులు.....

"మనం గెలిచినప్పుడు భుజం తట్టే వాళ్లు , ఓడినప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు నలుగురు లేనప్పుడు
ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా పెద్ద తేడా ఉండదు"

"అందం అంటే మనం ఇతరులకు నచ్చేలా ఉండడం కాదు. మనకు నచ్చేలా మనం ఉండడం "

"ఒకరికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం మరొకరికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఇంకోళ్ళకి రాముడంటే ఇష్టం
మరి ఇక్కడుండే వాళ్ళందరికీ ఒక్క దేవుడే నచ్చనప్పుడు ఆఫ్ట్రాల్ నేను మనిషిని నేను అందరికీ నచ్చాలని రూలేం లేదు కదా."

'నేను నీకు నచ్చకపోతే ఆది నీ ప్రాబ్లమ్ నాది కాదు."

" దేవుడు చెడ్డవాడు
కళ్ళు ఉన్నాయని ఆనందించేలోపే కన్నీళ్లున్నాయని గుర్తుచేస్తాడు."

ఎవరైనా ఎదిగిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. కానీ నీ కొడుకు ఎదగటానికి పెళ్లి చేసుకుంటున్నాడు. తప్పు.

"నిజం చెప్పక పోవడం ఆబధ్ధం
అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నించడం మోసం"

"గెలిచినప్పుడు ఏ వెధవైనా నవ్వుతాడు.
ఓడిపోయినప్పుడు నవ్వే వాడే హీరొ".

"మనం రిక్షా తొక్కి పైకొచ్చాం కదా అని, మన పిల్లల్ని కూడా రిక్షా తొక్కమనడం... కరెక్ట్ కాదు అంకుల్ "

"మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే , వారి తప్పులను క్షమించ గలగాలి, లేదా ప్రేమించట్లేదని ఒప్పుకోవాలి."


"మీకొక మనిషి తెలుసు, నాకొక పేరు తెలుసు..
వెతుకుదాం..
మీ భయం పోయెదాకా.. నా కోపం తగ్గే దాకా..
వాడు చచ్చే దాకా!!"


ఇప్పుడు కొన్ని కామెడీ వి.

కుర్రాడు చాకు లాగా ఉన్నాడు
"ఇంతకు ముందు కత్తి లాగా ఉండేవాడు .ఈ మధ్య డైటింగ్ చేశాడు"

" నీ తో ఇదేరా ప్రాబ్లమ్. సెంటీమీటర్ చనువిస్తె చాలు కిలోమీటర్ దూసుకెళ్లి పోతావ్."

"బంతీ
ఏం కావాలి సర్?
కొంచెం మనశ్శాంతి"


ఆ అమ్మాయిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు రా
అంత లావా?

"colleges ఎలా ఉన్నారు?
ఒక అమ్మాయి బాగుంది అంకుల్"

ఈ మైక్ made in japan.
ఇండియా లో పనిచేస్తుందా????
జోక్...
మైక్..

"అంజనేయ స్వామి తెలుసా
గుళ్ళో చూడడమేనండీ బయట పెద్ద పరిచయం లేదు."

ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. చదువరులకు నచ్చితే మరిన్ని పోస్ట్ చేస్తా.

ప్రస్తుతానికి ఉంటానేం.

7 comments:

  1. మంచి కలెక్షన్... ఇలా త్రివిక్రం డైలాగులు ఇంకా వ్రాస్తూ ఉండండి :)

    ReplyDelete
  2. పంచ్ డైలాగ్స్ మరోసారి గుర్తు చేసారు. nice post keep writing.

    ReplyDelete
  3. మరిచిపొతున్న డైలాగ్స్ మరోసారి గుర్తు చేసారు.very nice. keep posting such a dialogs.

    ReplyDelete
  4. బాగా ఉంది మీ టపా.త్రివిక్రం డైలాగులు నిజంగానే మీరన్న సినిమాలకి ఊపిరిగ నిలిచాయి.మీ నుండి "జల్సా" డైలాగులు ఆశిస్తున్నాను.

    ReplyDelete
  5. ninne premistaa dialogues kuda trivikrame.....nuvvu preminchani nenu baadhapadutunte...nuvvu preminchina kallu varshistunnayi....

    ReplyDelete
  6. ప్రపుల్ల చంద్ర గారికీ, చైతన్య గారికీ, sri satya గారికీ, శ్రీ గారికీ,
    నరహరి గారికీ నా థాంక్స్.
    @శ్రీ: అయ్య బాబోయ్ జల్సా సినిమా ఎనిమిది సార్లు చూసిన మీకు ఆ సినిమా డైలాగ్స్ నేనేం చెప్పగలనండీ బాబూ(మీ ప్రొఫైల్ లో చూసాలెండి). నాకు ఇదీ అదీ అని ఏమీ లేదండీ మన త్రివిక్రముని సినిమా ఏదయినా సరే. డైలాగులు బాగున్నాయి అని అనిపిస్తే చాలు రాసేయ్యడమే. అయినా మీరు చెప్పారు కాబట్టి ట్రై చేస్తా.
    @narahari: అవునా నాకు ఇప్పటిదాకా తెలియదు సుమండీ. "నువ్వు ప్రేమించని నేను బాధపడుతుంటే నువ్వు ప్రేమించిన కళ్లు వర్షిస్తున్నాయి". చాలా బాగుందండీ.

    ReplyDelete
  7. nice collection...............

    ReplyDelete