చివరి సారిగా టపా రాసి రెండు నెలలు పైనే అవుతోంది. మధ్యలో రెండు నెలలుగా ఎక్జామ్స్ తో బాగా బిజీ గా ఉండడం తో రాయడం కుదరలేదు. బ్లాగులు చదివింది కూడా చాల తక్కువే.
ఈ మధ్య జరిగిన సంఘటనలూ విశేషాలూ.
నాలుగో తేదీ విజయవాడ లో జరిగిన పుస్తక మహోత్సవానికి వెళ్ళాను. నాలుగు సంవత్సరాలుగా ఎప్పుడూ మిస్సవలేదు. ఈసారి నాకుందేమో తక్కువ టైం.
సరే ఒక్కొక్కటిగా బుక్ స్టాల్స్ ని చూసుకుంటూ వెళుతున్నాను. అక్కడి ప్రాంగణం లో రెండు సభలు జరుగుతున్నాయి. ఒక దానిపై పట్టాభిరాం గారి సభ జరుగుతోంది. మరొక దానిపై ఏమి జరుగుతోందో చూద్దామని వెళ్ళానా ఇంకేముంది అక్కడ "e-తెలుగు" అనే బానర్ కట్టి ఉంది. చూస్తే ఎవరో లేఖిని గురించీ తెలుగు బ్లాగుల గురించీ ప్రసంగిస్తున్నారు. భలే ఆనందమేసింది. ఆయన పవర్ పాయింట్ ఉపయోగించి చక్కగా వివరిస్తున్నారు. సభ అయిపోయిన తర్వాత ఆయనని కలుసుకొని నన్ను నేను పరిచయం చేసుకున్నాను. అప్పుడు తెలిసింది. ఆయనే కిరణ్ గారని. అదే నేను మొదటి సారి ఇతర బ్లాగర్లను కలుసుకోవడం. నా బ్లాగు పేరడిగారాయన. యువకుడు అని చెప్పాను. అక్కడ ఉన్న అందరు బ్లాగర్లు కలసి ఫోటో తీసుకుంటున్నారు. నన్ను కూడా వచ్చి నిలబడమన్నారు.
ఇదిగో అదే ఈ ఫోటో.
ఆ ఆరెంజ్ కలర్ చెక్స్ షర్టు వేసుకొని ఉన్నది నేనే(కుడి వైపు)
అరుణం బ్లాగు రచైత అరుణ గారూ, జీవితం లో కొత్త కోణం బ్లాగు రచైత శ్రీనివాస్ గారూ పరిచయమయ్యారు. ఇప్పుడే ఈ ఫోటో లు చూస్తుటే తెలుసింది చదువరి గారు కూడా అక్కడే ఉన్నారని. ఆయన్ని కలుసుకోలేక పోయినందుకు కొంచెం బాధగా ఉంది.
పుస్తకాల విషయానికొస్తే ఒక పది పుస్తకాలు కొన్నా. నామిని రాసిన మిట్టూరోడి కథలూ, రంగనాయకమ్మ గారి కథల సంపుటి "అమ్మకి ఆదివారం లేదా?" , ఇంకా యండమూరి కొత్త పుస్తకం("వీళ్లనేం చేద్దాం?"), ఏమిటో ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అనుకుంటుంటే ఇక్కడ కూడా ప్రశ్నలే! :) ఇంకా pleasures of లైఫ్ అనే ఇంగ్లీష్ పుస్తకమూ, రిచ్ డాడ్ పూర్ డాడ్ మొదలైనవి కొన్నా. పండక్కి సెలవులు తీసుకొని తరువాత రోజు పొద్దున్నే విజయవాడ నుంచి మా ఊరు వొచ్చాను. అదేనండీ నెల్లూరు జిల్లా కావలి. కొన్న పుస్తకాలన్నే ఈ సెలవుల్లో చదివేయ్యాలి. ఇంకా ఈ సెలవుల్లో కరువుతీరా ఒక నాలుగు టపాలన్నా రాసెయ్యాలి. మా అమ్మ పెట్టే ఫిల్టరు కాఫీ రోజుకి రెండు కప్పులన్నా తాగేయ్యాలి. ఇంకా చాలా పనులున్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఈ టపాని ఇక్కడితో ముగిస్తున్నా. మరిన్ని కబుర్లతో మరో టపా రాస్తా.
శరత్ సోలా.
Subscribe to:
Post Comments (Atom)
మరిన్ని టపాలకొరకు ఎదురు చూస్తుంటాం అయితే
ReplyDeleteశరత్, స్వాగతం! అవును, అక్కడ కలుసుకోలేకపోయాం. ఈసారెప్పుడైనా కలుద్దాం.
ReplyDeleteనేస్తం గారికీ చదువరి గారికీ నా ధన్యవాదాలు.
ReplyDeleteశరత్ సోదరా... మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. టపాలు రాస్తూండండి.
ReplyDeletemee blog baagumdi..mee blog nu nelluru blaagula samudaayaaniki kalapaTam jarigimdi..meeku intrest umTea nellore blaagarla gumpuloe chearamDi..vivaraalaku ikkaDa chuuDamDi..www.nelloreblogs.blogspot.com
ReplyDeleteమీబ్లాగు బాగుంది.. మీ బ్లాగును నెల్లూరు బ్లాగుల సముదాయానికి కలపటం జరిగింది..మీకు ఆసక్తి ఉంటే నెల్లూరు బ్లాగర్ల గుంపులో చేరండి..వివరాలకు మీ జీ మెయిల్ అడ్రస్ వివరాలు దీనికి తెల్పండి.. vasilisuresh@gmail.com plese visit www.nelloreblogs.blogspot.com
ReplyDelete