Friday, August 14, 2009

మీరు బ్లాగు పోస్టులు ఎలా రాస్తారు?

చాలా మంది చెప్పే మాట లేఖిని వాడతాము అని.
ఏమో నాకు ఆది అంత కన్వీనియెంట్ గా అనిపించ లేదు. మరి ఏం చేశాను? మొదట్లో గూగుల్ వాడి ఇండిక్ translation వాడాను. కానీ దాన్లో ఓ చిక్కుంది. అదేంటో తర్వాత చెప్తా. అందుకని నేను మరో మార్గం కనిపెట్టాను. ముందుగా ఎమెస్ వర్డ్ లొనో లేకపోతే నోట్ పాడ్ లొనో చక్కగా తెలుగు ని ఇంగ్లీష్ లో అంటే ఇలా english ni telugu lo అన్నమాట టైప్ చేసుకుంటూ వెళ్ళి పోతాను. తర్వాత క్విల్ పాడ్ ని ఓపెన్ చేసి ఎడిటర్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడ టైప్ చేసినదంతా ఇక్కడ ఎడిటర్ లో పేస్ట్ చేస్తాను. అప్పుడు ఆది అంతా చక్కగా తెలుగులోకి మారిపోతుంది. అఫ్ కోర్స్ ఒక టెన్ పర్సెంట్ మనం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఈ పద్దతే సులభం గా అనిపించింది. అదే మనం తెలుగు ని ఇంగ్లీష్ లో టైపు చేసిన దానిని గూగుల్ ఇండిక్ translation లో మనం పేస్ట్ చేస్తే అది ఆటోమాటిక్ గా కన్వర్ట్ చేయదు. నేను ఇందాక ఇండిక్ translation లో చిక్కుంది అన్నాను కదా అది ఇదే.

ఐతే మీరు అనొచ్చు క్విల్ పాడ్ లోనే డైరెక్ట్ గా టైప్ చెయ్యొచ్చు కదా అని. అక్కడ సమస్య ఏంటంటే మనం దాన్లో టైప్ చేస్తుంటే వెంటనే ఆది కన్వర్ట్ చేస్తూ పోతుంది. అప్పుడు తప్పులు పడుతూ ఉంటే ఆలోచన సరిగ్గా సాగదు. నాకైతే ఆ తప్పుల్ని సరి చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. మన ఆలోచనలని అంతే వేగం తో అక్షరాలలోకి టైప్ చేసుకుంటూ పోవాలంటే మొదట ఇలా ఇంగ్లీష్ లో టైప్ చేసుకొని తర్వాత కన్వర్ట్ చేయడమే బెటర్ అని నా అభిప్రాయం.

మరో మంచి పద్ధతి ఏమైనా ఉంటే చెప్పండి. తెలుసుకుంటాను.

12 comments:

  1. బరహ www.baraha.com ప్రయత్నించండి. అన్నింటికన్నా అదే బెస్టు.

    ReplyDelete
  2. What is the problem that you have with Google Indic translator? I have been using it. When compared with Lekhini & Quillpad I feel it is more comfortable.

    ReplyDelete
  3. బ్లాగులోనే మీరు నేరుగా తెలుగులో రాయొచ్చు.. లేదంటే జిమెయిల్ లో తెలుగు ఆప్షన్ ఎంపిక చేసుకుని టపా రాశాక బ్లాగులో పేస్ట్ చేయొచ్చు

    ReplyDelete
  4. నేనైతే నేరుగా తెలుగులోనే టైపు చేసేస్తాను. ఎందుకంటే, నేను ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకున్నాను కాబట్టి.

    అలానే, బరహా వాడినా కూడా నేరుగా టైపు చెయ్యవచ్చు. ఇలాంటి పరికరాల కోసం ఈ లింకులోని "కంప్యూటర్లో ఎక్కడైనా తెలుగు టైపు చెయ్యడానికి" అన్న విభాగంలో చూడండి.

    ReplyDelete
  5. మీరు మోజిల్లా ఫైర్‌ఫాక్స్ ను కనుక వాడుతుంటే ఇండిక్ ఇన్‌పుట్ ఎక్స్‌టెన్షన్ ను ప్రయత్నించండి.
    http://addons.mozilla.org/en-US/firefox/addon/3972

    ReplyDelete
  6. meeku evarynaa javabu chepite naaku chepandi please.

    ReplyDelete
  7. interesting information.!
    Thank you.!
    I usually type either directly in blogger or in google indic transliteration.

    ReplyDelete
  8. ముందస్తుగా
    http://www.omicronlab.com/tools/icomplex-full.html సైటులోకి వెళ్ళి iComplex Full Version ని డౌన్ లోడు చేసుకొని మీ సిస్టమ్ లో స్థాపించుకోండి. అప్పుడు మీ MS-Word Fonts Menu లో Gautami అనే కొత్త ఖతి (font) రావడాన్ని మీరు గమనిస్తారు.

    తరువాత బరహ డాట్ కామ్సైట్ లోకి వెళ్ళి బరహ అనే బహుభాషా సాఫ్టువేరు (ఉచితం) డౌన్ లోడు చేసుకొని మీ సిస్టమ్ లో స్థాపించుకోండి.

    అప్పుడు మీ start menu లో దాని తాలూకు ఐకాన్ ఒకటి వస్తుంది. దానిమీద నొక్కితే అనేకభాషల మెన్యూ వస్తుంది. అందులో తెలుగుమీదికి కర్సర్ ని పోనిచ్చినప్పుడు అది ANSI and Unicode అని రెండు ఎంపికలిస్తుంది. అందులో Unicode ని ఎంచుకోండి. అంతే. ఇహ మీరు మెయిళ్ళు, బ్లాగులూ అని తేడా లేకుండా అన్ని వెబ్ పుటల్లోను నేరుగా తెలుగు టైప్ చెయ్యగలుగుతారు. దీని టైపింగ్ పద్ధతి దాదాపుగా లేఖిని మాదిరే ఉంటుంది. తెలుగు Text మధ్యలో ఇంగ్లీషు టైప్ చెయ్యాల్సి వస్తే F11 మీట నొక్కండి. మళ్లీ తెలుక్కి మళ్ళాలన్నా అదే మీట నొక్కాలి.

    బరహ ని ఉపయోగించి వెబ్ పుటల్లోనే కాక MS-Word, Notepad లలో కూడా తెలుగులో టైప్ చెయ్యవచ్చు. అందుకోసం Format Menu లో Styles and Formatting మీద నొక్కాలి. అప్పుడు Word Page కుడిపక్క అదే పేరుతో ఒక జాబితా వస్తుంది. దాని పైన New Style అనేదాని మీద నొక్కితే ఒక విండో తెరుచుకుంటుంది. అందులో Gautami ఖతిని, Complex ని ఎంచుకొని OK అనండి. ఇహ MS-Word లో తెలుగు టైప్ చేయడం ప్రారంభించండి.

    ReplyDelete
  9. క్షమించాలి. ఇంతకుముందటి వ్యాఖ్యలో iComplex download link ని సరిగా ఇచ్చినట్లు లేదు. దాని URL ఇది.

    http://www.omicronlab.com/tools/icomplex-full.html

    ReplyDelete
  10. @మహేష్ గారు
    కామెంట్ రాసినందుకు థాంక్స్.

    @Venkata Ganesh. గారూ, ఇండిక్ translation తో ఇబ్బంది ఏమిటి అని అడిగారు కదా. నేను బ్లాగ్ పోస్ట్ ని ఎడిట్ చేశాను. ఒక్కసారి చూడగలరు.

    @మురళి గారు
    మీరు చెప్పినట్టు బ్లాగు లోనే డైరెక్ట్ గా తెలుగు లో రాయొచ్చు. అది ఇంటర్నల్ గా వాడేది google indic translation టూల్. అంటే indirect గా google indic translation ని వాడినట్లే.

    @వీవెన్ గారు
    మంచి లింకు ఇంచ్చినందుకు థాంక్స్.
    నా గొడవంతా ఇన్స్క్రిప్ట్ రాని నాలాంటి వాళ్ళకోసం ఏమైనా మంచి పద్ధతి వెతకడమే.

    @Enaganti Ravi Chandra garu
    thank you.


    @మధురవాణి గారు
    you are most welcome.


    @ తాడేపల్లి గారు
    చాలా మంచి సమాచారాన్ని అందించినందుకు తాడేపల్లి గారికి నా ధన్యవాదాలు.
    నిజంగానే బరాహా మంచి ఉపకరణం. ఐతే బరహ లో టైపింగ్ అనేది లేఖిని కి దగ్గరగా ఉంటుంది. అందుకే నాకు బరహ కానీ లేఖిని గానీ అంతగా నచ్చలేదు. ఐతే ఆఫ్‌లైన్ లో నెట్ తో సంబంధం లేకుండా టైప్ చేసుకోడానికి బరహ ఖచ్చితం గా చాలా మంచి ఉపకరణం.
    ఈ బారహా/ లేఖిని లో లేనిదీ క్విల్ పాడ్ లో ఉన్నదీ ఒక్కటే. ఆది స్పెల్లింగ్ ని పదానికి దగ్గరగా టైప్ చేస్తే కరెక్ట్ గా దానిని కన్వర్ట్ చేయగలగడం. ఐతే క్విల్ పాడ్ కి నెట్ కనెక్షన్ తప్పనిసరి. లేఖిని/బరహ కి ఐతే నెట్ అవసరం లేదు. అందుకనే నేను ఈ రెండు ప్రయోజనాలనీ కలపడానికి ప్రయత్నించాను.
    మిగతా వాటితో సంబంధం లేకుండా icomplex full ని మాత్రం అందరం install చేసుకోవాల్సిందే.

    ReplyDelete
  11. నా అభిప్రాయం. అనుభవం కూడా ఈ బ్లాగులో కామెంట్ రూపంలో పెడదామని ప్రయత్నిస్తే ఇదే ఓ పెద్ద ఆర్టికల్ లాగా అయిపోయింది. అందుకనే దీన్ని నా బ్లాగులోనే పోస్ట్ చేశాను. సహ బ్లాగర్ మిత్రులు సహకరించాలని కోరుతున్నా.

    వివరాలకు చూడండి.

    http://blaagu.com/chandamamalu/

    ReplyDelete
  12. నేను ఉబుంటూ(ubuntu) వాడుకరిని. నేను ఉబుంటూలో SCIM Input Method Setup ద్వారా నాకు కావలసిన భాషలన్నింటిని install చేసుకున్నాను. దీని ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన భాషలో ఆంగ్ల కీబోర్డును వాడి టైప్ చేసుకోవచ్చు.

    ReplyDelete