Friday, August 14, 2009

మీరు బ్లాగు పోస్టులు ఎలా రాస్తారు?

చాలా మంది చెప్పే మాట లేఖిని వాడతాము అని.
ఏమో నాకు ఆది అంత కన్వీనియెంట్ గా అనిపించ లేదు. మరి ఏం చేశాను? మొదట్లో గూగుల్ వాడి ఇండిక్ translation వాడాను. కానీ దాన్లో ఓ చిక్కుంది. అదేంటో తర్వాత చెప్తా. అందుకని నేను మరో మార్గం కనిపెట్టాను. ముందుగా ఎమెస్ వర్డ్ లొనో లేకపోతే నోట్ పాడ్ లొనో చక్కగా తెలుగు ని ఇంగ్లీష్ లో అంటే ఇలా english ni telugu lo అన్నమాట టైప్ చేసుకుంటూ వెళ్ళి పోతాను. తర్వాత క్విల్ పాడ్ ని ఓపెన్ చేసి ఎడిటర్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడ టైప్ చేసినదంతా ఇక్కడ ఎడిటర్ లో పేస్ట్ చేస్తాను. అప్పుడు ఆది అంతా చక్కగా తెలుగులోకి మారిపోతుంది. అఫ్ కోర్స్ ఒక టెన్ పర్సెంట్ మనం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఈ పద్దతే సులభం గా అనిపించింది. అదే మనం తెలుగు ని ఇంగ్లీష్ లో టైపు చేసిన దానిని గూగుల్ ఇండిక్ translation లో మనం పేస్ట్ చేస్తే అది ఆటోమాటిక్ గా కన్వర్ట్ చేయదు. నేను ఇందాక ఇండిక్ translation లో చిక్కుంది అన్నాను కదా అది ఇదే.

ఐతే మీరు అనొచ్చు క్విల్ పాడ్ లోనే డైరెక్ట్ గా టైప్ చెయ్యొచ్చు కదా అని. అక్కడ సమస్య ఏంటంటే మనం దాన్లో టైప్ చేస్తుంటే వెంటనే ఆది కన్వర్ట్ చేస్తూ పోతుంది. అప్పుడు తప్పులు పడుతూ ఉంటే ఆలోచన సరిగ్గా సాగదు. నాకైతే ఆ తప్పుల్ని సరి చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. మన ఆలోచనలని అంతే వేగం తో అక్షరాలలోకి టైప్ చేసుకుంటూ పోవాలంటే మొదట ఇలా ఇంగ్లీష్ లో టైప్ చేసుకొని తర్వాత కన్వర్ట్ చేయడమే బెటర్ అని నా అభిప్రాయం.

మరో మంచి పద్ధతి ఏమైనా ఉంటే చెప్పండి. తెలుసుకుంటాను.