తెలుగు లో ఆన్ లైన్ లో రేడియో విందాం అనుకునే వాళ్ళకు అద్భుతమైన సైట్ టోరీ. ఇది పూర్తిగా ఉచితం. అంతే కాదు దీనిలో వాణిజ్య ప్రకటనలు కూడా చాలా తక్కువ. మనకి ఓపిక ఉండాలే గానీ ఇరవై నాలుగు గంటలపాటూ పాటలు వినవచ్చు.
దీనిలో పది తెలుగు చానల్స్ ఉన్నాయి.
ఘంటసాల పాటలు, రహమాన్ పాటలు, సరికొత్త పాటలు, అల్ టైం హిట్స్, తొరి లైవ్ అనే అయిదు వైవిధ్యమన చానెల్స్ తో పాటు US Pacific, US Eastern, UK, IST, Australia అనే మరో అయిదు చానెల్స్ కూడా ఉన్నాయి. ఈ చివరి చానెల్స్ లో ఆయా దేశాల సమయాలని అనుసరించి పాటలు, కార్యక్రమాలు వస్తాయి.
నాకెంతో నచ్చే ఆన్ లైన్ తెలుగు రేడియో Tori.దీనిలో పది తెలుగు చానల్స్ ఉన్నాయి.
ఘంటసాల పాటలు, రహమాన్ పాటలు, సరికొత్త పాటలు, అల్ టైం హిట్స్, తొరి లైవ్ అనే అయిదు వైవిధ్యమన చానెల్స్ తో పాటు US Pacific, US Eastern, UK, IST, Australia అనే మరో అయిదు చానెల్స్ కూడా ఉన్నాయి. ఈ చివరి చానెల్స్ లో ఆయా దేశాల సమయాలని అనుసరించి పాటలు, కార్యక్రమాలు వస్తాయి.
అల్ టైం హిట్స్ లో ఎన్నో మంచి మంచి పాటలు వినచ్చు. ఒక వేళ మనకు ఆ వచ్చే పాట నచ్చకపోతే ఎటు తిరిగీ వేరే చానల్స్ సిద్ధం గా నే ఉన్నాయి. నాకైతే ఎప్పుడు టోరీ ని విన్నా ఏదో ఒక ఛానల్ లో నాకు నచ్చే పాట వస్తుంది.(ఇప్పుడు చినుకు లా రాలి నదులుగా సాగి పాట వస్తోంది సినిమా: నాలుగు స్తంబాలాట) నేను ఎన్నో మంచి పాటలను గుర్తుచేసుకుని మళ్ళీ వినగలిగాను.
మీరు కూడా మీకు నచ్చే మంచి మంచి పాటలు వినాలనుకుంటే ........ఆలస్యం లేకుండా టోరి కి ట్యూన్ అయిపోండి మరి.